పవన్ యాత్రకు బ్రేక్...

పవన్ యాత్రకు బ్రేక్...

ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పర్యటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్... నేటి నుంచి రెండు రోజుల పాటు 'జనసేన పోరాట యాత్ర'కు బ్రేక్ ఇచ్చారు. విశాఖ జిల్లాలో విశ్రాంతి తీసుకుంటున్న పవన్ కల్యాణ్... విరామం తర్వాత తిరిగి శృంగవరపుకోట నుంచి యాత్రను ప్రారంభించనున్నారు. ఇక జనసేన పోరాట యాత్రలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు పవన్... తనకు బీజేపీతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసిన ఆయన... విజయనగరం జిల్లా భోగాపురంలో ఆయన మాట్లాడుతూ తనకు వ్యక్తిత్వం ఉందని మూడున్నరేళ్లలో 36 సార్లు మాటలు మార్చే అలవాటు తనకు లేదన్నాడు. ఇక ఏపీలో మూడు బీజేపీలు ఉన్నాయంటూ పవన్ సెటైర్లు వేశారు.