పిడుగు పాటుకు ఇద్దరు మృతి..

పిడుగు పాటుకు ఇద్దరు మృతి..

కర్నూలు జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. వర్షంతో పెద్ద సంఖ్యలో పిడుగులు పడ్డాయి. జిల్లాలో పిడుగు పాటుకు ఇద్దరు బలయ్యారు. జిల్లాలోని హాలహర్వి మండలం చింతకుంట గ్రామంలో శీనప్ప (42) అనే మేకల కాపరి పిడుగు పాటుకు గురై మృతిచెందగా... ఆస్పరి మండలం ముత్తకురుకు చెందిన రంగప్ప(40) అనే వ్యక్తి  కూడా పిడుగు పాటుతో మృతిచెందారు.