'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్'కు రెండు అవార్డులు !

'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్'కు రెండు అవార్డులు !

అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్'.  గతేడాది విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమైంది.  డిస్ట్రిబ్యూటర్లు పెద్ద మొత్తంలో డబ్బు కోల్పోయారు.  ప్రేక్షకులు సైతం సినిమాపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.  చిఎవరికి అమీర్ ఖాన్ బహిరంగంగా ప్రేక్షకులకి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.  ఇలాంటి సినిమాని రెండు అవార్డులు వరించాయి.  

ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ తాజాగా అవార్డుల్ని ప్రకటించింది.   విఎఫ్ఎక్స్ కేటగిరీలో బెస్ట్ ఇండియన్ సినిమా, బెస్ట్ షాట్ ఆఫ్ ది ఇయర్ అవార్డుల్ని ఈ సినిమా గెలుచుకుంది.  విజయ్ కృష్ణ ఆచార్య డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కోసం బడ్జెట్లో ఎక్కువ మొత్తాన్ని ఖర్చు పెట్టారు.