ఉప్పల్‌ లో గ్యాంగ్‌ వార్‌...

ఉప్పల్‌ లో గ్యాంగ్‌ వార్‌...


తాజాగా హైదరాబాద్ ఉప్పల్ స్ట్రీట్ నెంబర్-8 లో జరిగిన ఓ సంఘటన కలకలం రేపుతోంది. గణేష్ నిమజ్జనం రోజున జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అదేంటంటే ఉప్పల్‌ స్ట్రీట్ నెంబర్-8 లో గ్యాంగ్‌వార్‌ జరిగింది. ఎస్.ఆర్ అపార్టుమెంట్స్ దగ్గర రెండు గ్యాంగుల మద్య ఘర్షణ జరిగి విచక్షణారహితంగా కొట్టుకొని చుట్టుప్రక్కల ప్రజలను భయభ్రాంతులకు గురి చేశాయి. దీంతో భయాందోళనకు గురైన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గ్యాంగ్‌వార్‌పై ఆరా తీస్తున్నారు. ఓయూ క్యాంపస్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబందించిన వీడియో బయటకు రావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.