జగన్‌ కేసు: ఇద్దరు ఐఏఎస్‌లకు ఊరట..

జగన్‌ కేసు: ఇద్దరు ఐఏఎస్‌లకు ఊరట..

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో ఇద్దరు ఐఏఎస్ అధికారులకు ఊరట లభించింది. ఐఏఎస్ అధికారులు బీపీ ఆచార్య, ఆదిత్య నాథ్‌దాస్‌కు ఊరట కల్పిస్తూ ఇద్దరిపై ఉన్న కేసులను కొట్టివేసింది తెలంగాణ హైకోర్టు. ఈ ఇద్దరు ఐఏఎస్‌ అధికారులపై ఉన్న ఈడీ కేసులు కొట్టివేసింది హైకోర్టు. అయితే, ప్రాసిక్యూషన్ కు అనుమతి తీసుకోకపోవడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. సుప్రీంకోర్టు వెళ్లేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ఈడీ) గడువు కోరగా.. నాలుగు వారాలు తీర్పు అమలు నిలిపి వేసేందుకు హైకోర్టు అంగీకరించింది.