ఆర్టీసీ బస్సు బోల్తా.. ఇద్దరు మృతి..

ఆర్టీసీ బస్సు బోల్తా.. ఇద్దరు మృతి..

తెలంగాణకు చెందిన ఆర్టీసీ బస్సు బోల్తా పడిన ఘటనలో ఇద్దరు మృతిచెందారు... వివరాల్లోకి వెళ్తే కృష్ణా జిల్లాలో పెనుగంచిప్రోలు మండలం 65వ నంబర్ జాతీయ రహదారిపై నవాబుపేట దగ్గర తెలంగాణకు చెందిన ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సుడ్రైవర్‌తో పాటు కండెక్టర్ కూడా మ‌ృతి చెందారు. మరో ఎనిమిది మంది ప్రయాణికులు తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రుల్ని నందిగామ ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగిందంటున్నారు ప్రయాణికులు. రాష్‌ డ్రైవింగ్‌తో బస్సు అదుపు తప్పి బోల్తాపడిందని అంటున్నారు. ప్రమాదానికి గురైన బస్సు నిర్మల్ డిపోకు చెందిన బస్సుగా గుర్తించారు పోలీసులు. బస్సు నిర్మల్ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులున్నారు.