బోర్ కొట్టి ఆ భర్తలు భార్యలను మార్చుకున్నారు... చివరకు ఇలా... 

బోర్ కొట్టి ఆ భర్తలు భార్యలను మార్చుకున్నారు... చివరకు ఇలా... 

బోర్ కొట్టిన వ్యక్తులు ఎవరైనా మొబైల్, కార్లు లేదా ఇల్లు మారుస్తుంటారు.  కానీ, ఈ వ్యక్తులు మాత్రం బోర్ కొట్టేసి ఏకంగా భార్యలను మార్చేసుకున్నారు.  అయితే, ఇందులో ఓ వ్యక్తి భార్య మాత్రం అందుకు ఒప్పుకోలేదు. చివరకు ఏమైంది అనే విషయం అందరికి తెలిసే ఉంటుంది.  

ముంబై కి చెందిన ఓ వ్యక్తికీ ఇటీవలే పెళ్లయింది.  భార్య భర్త ఇద్దరు సాఫ్ట్ ముంబై లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు.  మంచి లైఫ్ హ్యాపీగా కాలం గడుస్తోంది.  ఇదే సమయంలో లండన్ నుంచి తన ఫ్రెండ్ ఇండియాకు వచ్చాడు.  ఇతనికి కూడా ఇటీవలే వివాహం జరిగింది.  విదేశీ సంస్కృతికి అలవాటు పడిపోయారు.  ఇండియా వచ్చిన ఫ్రెండ్ ను ఇంటికి ఆహ్వానించాడు.  చాలా కాలం తరువాత కలుసుకోవడంతో ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి మద్యం సేవించారు.  లండన్ నుంచి వచ్చిన వ్యక్తికి ఓ ఆలోచన వచ్చింది.  భార్యలను మార్చుకొని ఎంజాయ్ చేద్దామని తన ఫ్రెండ్ తో చెప్పాలి.  మొదట ఒప్పుకోక పోయినా తరువాత ఒకే చెప్పాడు.  అయితే, లండన్ నుంచి వచ్చిన ఫ్రెండ్ తో కలిసి ఎంజాయ్ చేసేందుకు స్నేహితుడి భార్య ఒప్పుకోలేదు.  బలవంతం చేయబోతే తప్పించుకొని బయటకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది.  దీంతో పోలీసులు ఆమె భర్తను, స్నేహితుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.