హైదరాబాద్ లో మరో దారుణం

హైదరాబాద్ లో మరో దారుణం

తెలంగాణ రాష్ట్రంలో అందునా హైదరాబాద్ లో వరుస అత్యాచార ఘటనలు కలకలం రేపుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం అంటే ఆడవారికి పూర్తి భద్రత అని మొన్నటివరకు అంత మాట్లాడుకున్నారు కానీ ఇప్పుడు వరుస అత్యాచారాలు రాష్ట్ర పరువు తీస్తున్నాయి. వరంగల్, శంషాబాద్ అత్యాచార ఘటనలు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారగా అవి ఇంకా వార్తల్లో నిలుస్తుండగా హైదరాబాద్ లో ఈ ఉదయం మరో అత్యాచార ఘటన చోటు చేసుకుంది. ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగినిపై అత్యాచారం చేసిన ఘటన మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. అది జరిగి గంటలు కూడా గడవక ముందే హైదరాబాద్ లో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. పాతబస్తీ కుల్సుంపురలో ఓ యువతిని లాక్కెళ్లి బైక్ పై ఎక్కించుకుని కిడ్నాప్ చేశారు ఇద్దరు కామాంధులు. అయితే యువతి అరుపులు విన్న స్థానికులు బైక్ ను వెంబడించడంతో బైక్ ను అక్కడే వదిలి పరారయ్యారు ఇద్దరు నిందితుల. ఈ విషయం పోలీసుల దాకా వెళ్ళడంతో ఆ బైక్ ఆధారంగా ఆ వ్యక్తుల కోసం గాలిస్తున్నారు పోలీసులు.