మరో రెండు రోజులు భారీ వర్షాలు

మరో రెండు రోజులు భారీ వర్షాలు

ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్సాలతో తెలుగురాష్ట్రాల్లో ఇటు గోదావరి, అటు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నాయి. మరోవైపు వాయువ్య బంగాళాఖాతం ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో మరింత పెరగనుందని.. దీనికితోడు 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ, రేపు కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణం కేంద్రం చెబుతోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండగా.. మరో రెండు రోజులు మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడనున్నాయి.