దారుణం : యూపీలో మరో రెండు రేప్ లు

దారుణం : యూపీలో మరో రెండు రేప్ లు

ఉత్తర ప్రదేశ్‌లో మరో దారుణం జరిగింది. హాత్రాస్‌ ఘటన మరిచిపోక ముందే... మరో యువతిపై సామూహిక అత్యాచారం చేశారు దుండగులు. ఈ ఘటన బాల్‌రామ్‌పూర్‌లో జరిగింది. మార్నింగ్‌ వాక్‌ వెళ్లిన సమయంలో... ఎత్తుకెళ్లి రేప్ చేశారు. చిత్రహింసలు పెట్టి నరకం చూపించారు. అపస్మారకస్థితిలో ఉన్న బాధితురాలిని... రిక్షాలో ఇంటికి పంపించారు నిందితులు. లక్నోలోని ఆస్పత్రికి తరలించగా... చికిత్స పొందుతూ చనిపోయింది. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేశారు పోలీసులు. నిందితుల్లో ఒకరు మైనర్‌. ఉదయం ఇంటి నుంచి వెళ్లిన తన కూతురు... సాయంత్రం తీవ్రగాయాలతో ఇంటికి వచ్చిందని యువతి తల్లి చెబుతోంది.

కనీసం నడవలేనిస్థితిలో రిక్షాపై ఎవరో తీసుకొచ్చి వదిలిపెట్టారంది. తనని కాపాడాలంటూ... కన్నీళ్లు పెట్టుకుందని ఆవేదన వ్యక్తం చేసింది తల్లి. ఇక మరో కేస్ లో ఎనిమిదేళ్ళ బాలికను పక్కింట్లో ఉండే వ్యక్తి రేప్ చేశాడు. స్నానం చేయిస్తానని తీసుకు వెళ్లి ఆమె మీద రేప్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉంది. హథ్రాస్ అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. అర్ధరాత్రి సమయంలో పోలీసులు బాధితురాలి అంత్యక్రియలు చేయడం వివాదానికి మరింత ఆజ్యం పోసినట్టయ్యింది. దీనిపై, సోషల్‌ మీడియాలో దుమారం రేగుతుండగా... రాజకీయంగానూ పెద్ద రగడే జరుగుతోంది. విపక్షాలు ఆందోళనబాట పట్టడంతో.. యూపీ సర్కార్.. సమగ్ర విచారణకు సిట్ ఏర్పాటు చేసింది. బాధితురాలి కుటుంబానికి ఆర్థికసాయం ప్రకటించింది.