ఐపీఎల్ లో కొత్త జట్ల రాకపై బీసీసీఐ సమావేశం..

ఐపీఎల్ లో కొత్త జట్ల రాకపై బీసీసీఐ సమావేశం..

యూఏఈ  వేదికగా నిర్వహించిన ఐపీఎల్‌ 2020 సీజన్ సూపర్‌ సక్సెస్‌ కావడంతో బీసీసీఐ  14వ సీజన్‌ను భారత్‌లో నిర్వహించేందుకు సిద్ధమైంది భారత బోర్డు. అయితే వచ్చే ఐపీఎల్ లో రెండు కొత్త జట్లు రానున్నట్లు ఎప్పటినుండో వార్తలు వస్తున్నాయి. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రెండు కొత్త జట్లను చేర్చడం పై డిసెంబర్ 24 న జరగనున్న సర్వసభ్య సమావేశంలో బీసీసీఐ చర్చించనుంది. అలాగే 2028 ఒలింపిక్స్ లో క్రికెట్ చేర్చడం పై కూడా చర్చ జరపనుంది బీసీసీఐ. ఈ సమావేశానికి సంబంధించిన సమాచారాన్ని బీసీసీఐ సెక్రటరీ జైషా అనుబంధ విభాగాలకు పంపించారని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే కొత్తగా రెండు జట్లను చేరిస్తే మెగా వేలాన్ని నిర్వహించాల్సి ఉంటుంది. ఈ విషయంపై ఇప్పటికే ఆయా ఫ్రాంచైజీలు స్పష్టత కోరగా.. డిసెంబర్ వరకు వేచిచూడమన్న బోర్డు ఇంతవరకు అధికారికంగా ఏలాంటి ప్రకటన చేయలేదు.