కూలీ డబ్బులు అడిగితే.. ట్రాక్టర్ తో తొక్కించాడు..

కూలీ డబ్బులు అడిగితే.. ట్రాక్టర్ తో తొక్కించాడు..

చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం కృష్ణాపురంలో దారుణం జరిగింది. కూలీ డబ్బులు అడిగినందుకు ట్రాక్టర్ యజమాని ట్రాక్టర్ తో తొక్కించాడు. ఈ ఘటనలో డ్రైవర్ హరికృష్ణ, అడ్డుకోబోయిన అతని బంధువు నాగభూషణం ఇద్దరు మరణించారు. అనంతరం యజమాని చంద్రానాయక్ ఘటనాస్థలం నుంచి పరారయ్యారు. ఘటన గురించి సమాచారం అందుకున్న ఎమ్మెల్యే నవాజ్ బాషా బాధిత కుటుంబాలను పరామర్శించారు. గత 15 రోజులు వీరి మధ్య కూలీ డబ్బుల కోసం గొడవ జరుగుతున్నట్లు సమాచారం. గ్రామస్థుల ఫిర్యాదుతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.