చిరంజీవి సినిమాకి ఇద్దరు నిర్మాతలు !

చిరంజీవి సినిమాకి ఇద్దరు నిర్మాతలు !

మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే.  ప్రస్తుతం కొరటాల స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు.  ఈ చిత్రం కూడ కొరటాల గత సినిమాల్లాగే సామాజిక సందేశం కలిగిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఉంటుందట. 

ఈ చిత్రాన్ని రామ్ చరణ్ యొక్క కొణిదెల ప్రొడక్షన్స్, మాటనీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మించనున్నాయి.  త్వరలోనే నటీనటుల వివరాలు, సినిమా ఎప్పుడు మొదలవుతుంది వంటి వివరాలు తెలియనున్నాయి.  ఇకపోతే ప్రస్తుతం చిరు సురేందర్ రెడ్డి యొక్క 'సైరా' చిత్రీకరణలో బిజీగా ఉన్నారు.