ఎన్టీఆర్ కు రెండు పాటలు రెడీ 

ఎన్టీఆర్ కు రెండు పాటలు రెడీ 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న ఎస్ థమన్ శరవేగంగా ట్యూన్స్ కడుతున్నాడు. గతంలో ఎన్టీఆర్, థమన్ కాంబినేషన్ లో వచ్చిన బాద్షా, రామయ్య వస్తావయ్యా చిత్రాలు మ్యూజిక్ గా సూపర్ ఆల్బమ్స్ గా నిలిచిన నేపథ్యంలో ఈ కొత్త ప్రాజెక్టుపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. 

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..ఆల్రెడీ రెండు సూపర్ హిట్ పాటలను థమన్ కంపోజ్ చేశాడని తెలుస్తోంది.అటు షూటింగ్ విషయానికొస్తే రెండు భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ను చిత్రీకరించారు. ఎన్టీఆర్ ఈ సినిమాలో డిఫెరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ మొదటి సారి చేస్తుండడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఫ్యామిలీ ఎమోషన్స్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజ హెగ్డే కథానాయిక. దసరా నాటికి ఈ సినిమాను రిలీజ్ చేయాలనీ నిర్మాత ఎస్ రాధా కృష్ణ భావిస్తున్నారు.