'మజిలీ' వేడుకకు ఇద్దరు స్టార్ హీరోలు !

'మజిలీ' వేడుకకు ఇద్దరు స్టార్ హీరోలు !

సమంత, నాగ చైతన్యలు జంటగా నటించిన చిత్రం 'మజిలీ'.  పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రం ఏప్రిల్ 5న విడుదలకానుంది.  ఈలోపు భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు టీమ్.  ఈ వేడుక ఈ నెల 31న హైదరాబాదలో జరగనుంది.  ఈ వేడుకకు అక్కినేని నాగార్జున, వెంకటేష్ ఇద్దరూ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.  శివ నిర్వాణ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే మంచి క్రేజ్ తెచ్చుకుంది.  పెళ్లి తరవాత చైతన్య, సమంతలు కలిసి చేస్తునం మొదటి చిత్రం కావడంతో ప్రేక్షకులు మరింత ఆసక్తిగా ఉన్నారు.