సమంత, శర్వా సినిమాకు రెండు టైటిల్స్ !

సమంత, శర్వా సినిమాకు రెండు టైటిల్స్ !

 

తమిళంలో మంచి విజయాన్ని అందుకున్న '96' సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి  తెలిసిందే.  ఇందులో శర్వానంద్ హీరో కాగా సమంత హీరోయిన్.  తమిళ వెర్షన్ డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమార్ తెలుగు వెర్షన్ కూడా డైరెక్ట్ చేస్తున్నాడు.  ఈ సినిమా కోసం 'జాను, జానకీ దేవి' అనే రెండు టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి.  వీటిలో ఏదో ఒకదాన్ని టీమ్ ఫైనల్ చేయనుంది.  ఏప్రిల్ నుండి రెగ్యులర్ షూట్ మొదలుకానుంది.  ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.