రెండు రైళ్లు ఢీ.. కాచిగూడ స్టేషన్‌లో రైళ్లరాకపోకలు నిలిపివేత..

రెండు రైళ్లు ఢీ.. కాచిగూడ స్టేషన్‌లో రైళ్లరాకపోకలు నిలిపివేత..

హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వేష్టేషన్‌ను రైలు ప్రమాదం జరగడంతో.. కాచిగూడ రైల్వేస్టేషన్ మీదుగా వెళ్లే అన్ని రైళ్లను ప్రస్తుతం పూర్తిగా నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఇక, సాంకేతిక లోపంతో ఈ ప్రమాదం జరిగింది... కాచిగూడ స్టేషన్‌లో హంద్రీ ఎక్స్‌ప్రెస్ (17028) ఆగిఉండగా.. సాంకేతిక లోపంతో అదే ట్రాక్‌లు వచ్చిన ఎంఎంటీఎస్ రైలు వెనక్కనుంచి ఆ రైలును ఢీకొట్టింది. రెండో ట్రాక్‌లోకి వెళ్లాల్సిన ఎంఎంటీఎస్.. ఫోర్త్ ట్రాక్‌లోకి వెళ్లడమే ప్రమాదానికి కారణంగా చెబుతున్నారు. అప్పటికే ఫోర్త్ ట్రాక్‌పై హంద్రీ ఎక్స్‌ప్రెస్ ఆగిఉండడమే ప్రమాదానికి కారణమైంది. ఈ ప్రమాదంలో మొత్తం 30 మందికి పైగా ప్రయాణికులు గాయాలయ్యాయి. ప్రాణనష్టం జరగకపోయినా.. ఈ ప్రమాదంలో ప్రయాణికులు తీవ్రమైన దెబ్బలే తగిలాయని.. అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోచ్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్ కాపాడాలంటూ ఆర్తనాదాలు చేస్తుండగా.. ట్రైన్ డ్రైవర్‌ను కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి... ఇక, కర్నూలు నుంచి వచ్చిన హంద్రీ ఎక్స్‌ప్రెస్ సర్పూర్‌కాగజ్‌నగర్‌ వెళ్తుండగా.. కాచిగూడ స్టేషన్‌లో ఆగిఉంది.. ఫలక్‌నుమా నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న ఎంఎంటీఎస్ రైలు.. హంద్రీ ఎక్స్‌ప్రెస్‌ను వెనక్కి నుంచి ఢీకొట్టింది.