ఆ భర్తను చెరో మూడు రోజులు పంచుకున్నారు... అయితే.. 

ఆ భర్తను చెరో మూడు రోజులు పంచుకున్నారు... అయితే.. 

ఏవండోయ్ ఆవిడ వచ్చింది  అనే సినిమా గురించి అందరికి తెలిసిందే.  ఇద్దరు భార్యలు ఉంటె ఎన్ని ఇబ్బందులు వస్తాయో ఫన్నీగా చూపించారు.  అయితే అది సినిమా కాబట్టి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు.  ఇలాంటి ఘటన నిజజీవితంలో జరిగితే ఎలా ఉంటుంది.  ఎన్ని ఇబ్బందులు వస్తాయి చూద్దాం.  

ఝార్ఖండ్ లో ఓ వ్యక్తికీ ఇద్దరు భార్యలున్నారు.  ఇద్దరు భార్యలు ఉన్నప్పటికీ మొదట్లో సంసారం సాఫీగా జరిగింది.  సాఫీగా జరిగినప్పటికీ తరువాత కొన్ని ఇబ్బందులు వచ్చాయి.  పెద్ద భార్యకంటె చిన్న భార్య దగ్గరే ఎక్కువ సమయం గడుపుతున్నారని ఆమె వాపోయింది.  దీంతో పోలీసులు భర్తను, చిన్నభార్యను పిలిపించారు.  చిన్న భార్య దగ్గరే ఎక్కువగా ఉండకూడదు అని చెప్పారు.  అయితే, భర్త చిన్న భార్య దగ్గర కాకుండా పెద్దావిడ దగ్గర ఎక్కువగా ఉండటం మొదలుపెట్టాడు.  కొన్నాళ్ళకు ఈ పంచాయితీ మరలా పోలీసుల దగ్గరకు వెళ్ళింది.  ఈసారి పోలీసులు మద్యేమార్గంలో ఇద్దరి దగ్గర భర్త మూడు మూడు రోజుల చొప్పున ఉండాలని, ఆదివారం రోజున ఎక్కడైనా ఉండొచ్చని చెప్పారు.