పంజాబ్ లక్ష్యం 159...

పంజాబ్ లక్ష్యం 159...

రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఎనమిది వికెట్లు నష్టానికి 158 పరుగులు చేసింది. రాజస్థాన్ జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ రహానే(9), కృష్ణప్ప గౌతమ్(8)లు కొద్దీ వ్యవధిలోనే పెవిలియన్ బాట పట్టారు. ఈ దశలో మరో ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ (82; 58 బంతుల్లో 9 ఫోర్లు, 1  సిక్సు), సంజూ శాంసన్‌ (22; 18 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్సు)తో కలిసి జట్టును ఆదుకున్నాడు. సంజూ శాంసన్ కూడా భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత కొంత సమయానికే బట్లర్ స్టంప్ ఔట్ అయ్యాడు. చివరలో బెన్ స్టోక్స్, బిన్నీ కొన్ని విలువైన పరుగులు చేయడంతో 158 పరుగుల సాధారణ స్కోర్ చేసి.. పంజాబ్ ముందు 159 పరుగుల లక్ష్యంను ఉంచింది. పంజాబ్ బౌలర్లలో టై నాలుగు, ముజీబ్ రెండు వికెట్లు తీశారు.