నానితో యూటర్న్ హీరోయిన్..!!

నానితో యూటర్న్ హీరోయిన్..!!

దేవదాస్ హిట్ తరువాత నాని జర్సీ సినిమా చేస్తున్నాడు.  క్రికెట్ ప్రధానాంశంగా ఈ సినిమా తెరకెక్కుతుంది.  మళ్ళిరావా దర్శకుడు గౌతమ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.  ఈ సినిమాకు సంబంధించి ఓ అప్ డేట్ బయటకు వచ్చింది.  

కన్నడలో సూపర్ హిట్ అయిన యూటర్న్ సినిమా హీరోయిన్ శ్రద్దా శ్రీనాధ్ నాని సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నట్టు తెలుస్తున్నది.  సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ తెరకెక్కిస్తున్న ఈ సినిమా అక్టోబర్ మూడో వారంలో సెట్స్ మీదకు వెళ్లనున్నది.