ఏంటి.. సమంత మనసు మార్చుకుందా !

ఏంటి.. సమంత మనసు మార్చుకుందా !

స్టార్ హీరోయిన్ సమంత నటించిన చిత్రం 'యు టర్న్'.  సమంత ఎంతో ఇష్టపడి ఈ రీమేక్ సినిమాను చేశారు.  ముందుగా ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో సెప్టెంబర్ 13న విడుదలచేయాలని అనుకున్నారు.  

కానీ ఇప్పుడు వచ్చే సోమవారం విడుదల తేదీని ప్రకటిస్తాం అంటూ సమంత ట్వీట్ చేయడంతో విడుదల వాయిదాపడింది అర్థం అవుతోంది.  అయితే ఇన్ని రోజుల నుండి అనుకుంటున్న తేదీని మార్చడానికి గల కారణం ఏమిటనేది మాత్రం తెలియరాలేదు.  సస్పెన్స్ థ్రిల్లర్ గా రానున్న ఈ చిత్రంలో సమంత జర్నలిస్ట్ పాత్రలో కనిపించనుంది.  పవన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈచిత్రంలో భూమిక, అది పినిశెట్టి , రాహుల్ రవీంద్రన్ ముఖ్య పాత్రల్లో నటించారు.