అమెరికాలో పెరిగిన ఉద్యోగాలు; 3.6%కి తగ్గిన నిరుద్యోగిత

అమెరికాలో పెరిగిన ఉద్యోగాలు; 3.6%కి తగ్గిన నిరుద్యోగిత

అమెరికా ఆర్థిక వ్యవస్థ ఉద్యోగాల కల్పనలో దూసుకెళ్తోంది. మరో నెల కూడా ఉద్యోగాల వృద్ధి రేటులో పెరుగుదల కనిపించింది. దీంతో 1969 డిసెంబర్ అంటే 50 ఏళ్ల తర్వాత అమెరికాలో నిరుద్యోగిత రేటు కనిష్ట స్థాయికి పడిపోయింది. ఎక్కువ శాతం ఉద్యోగాలు నైపుణ్యంతో కూడినవి, వ్యాపారపరమైన సేవలు, నిర్మాణరంగం, వైద్యసేవల రంగంలో వచ్చాయి. గత నెల నుంచి ఉత్పత్తి రంగంలో ఉద్యోగితలో పెరుగుదల లేదు. రిటైల్ రంగంలో సుమారు 12,000 ఉద్యోగాలు పోయాయి.

బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిక్స్ విడుదల చేసిన నెలవారీ నివేదిక ప్రకారం అమెరికా ఆర్థిక వ్యవస్థ 70,000 పైచిలుకుగా ఉండొచ్చనే అంచనాలను తలకిందులు చేస్తూ ఏప్రిల్ నెలలో 2,63,000 ఉద్యోగాలు సృష్టించింది. యాహూ ఫైనాన్స్ ప్రకారం నిపుణులు ఈ నెలలో సుమారుగా 1,90,000 కొత్త ఉద్యోగాలు ఉండొచ్చని అంచనా వేశారు. గత ఏడాదితో పోలిస్తే వేతనాలు 3.2 శాతం పెరిగాయి. గంటలవారీ ఆదాయం కూడా 0.2 శాతం పెరిగింది. అయితే ఫెడరల్ రిజర్వ్ జోక్యం చేసుకొని వడ్డీరేట్లు పెంచకపోవచ్చని నిపుణులు అంటున్నారు.

నిరుద్యోగిత 50 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. అమెరికాలో నిరుద్యోగిత రేటు 3.6 శాతానికి చేరింది. 3.8 శాతంగా ఉండొచ్చన్న అంచనాల కంటే పూర్తి 0.2 శాతం పాయింట్లు తక్కువ. చివరిసారిగా దేశంలో నిరుద్యోగిత ఇంత తక్కువ స్థాయిలో ఉండటం అమెరికన్లు మొదటిసారి చంద్రుడిపై కాలూనడానికి కొన్ని నెలల ముందు జరిగింది. అప్పుడు అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ మొదటిసారి అధ్యక్ష పదవీకాలం ముగిసే సమయంలో జరిగింది. అప్పుడు నిరుద్యోగిత రేటు 3.5 శాతానికి పడిపోయింది.