యాపిల్ యాప్ స్టోర్ పై కేసుకు అమెరికా సుప్రీంకోర్ట్ ఓకే

యాపిల్ యాప్ స్టోర్ పై కేసుకు అమెరికా సుప్రీంకోర్ట్ ఓకే

అమెరికా టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ ఇరకాటంలో పడింది. ఐఫోన్ సాఫ్ట్ వేర్ అప్లికేషన్స్ మార్కెట్ ను ఏకస్వామ్యంగా మార్చుకొంటోందని ఆరోపిస్తున్న వినియోగదారులు యాపిల్ ఇంక్.పై కేసు వేసేందుకు అమెరికా సుప్రీంకోర్ట్ సోమవారం అంగీకరించింది. యాపిల్ ఏకస్వామ్యం కారణంగా తాము ఎక్కువ డబ్బు చెల్లించాల్సి వస్తోందని వారు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలను తిరస్కరిస్తూ కంపెనీ చెప్పబోయిన వివరణలను తిరస్కరించిన కోర్టు, యాపిల్ చర్యలు ఫెడరల్ యాంటీ ట్రస్ట్ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాయని చెప్పింది. 

చర్యలు తీసుకోవాలని కోరుతూ పిటిషన్లను విచారణకు స్వీకరించాలన్న కింది కోర్టు నిర్ణయాన్ని జస్టిస్ లు 5-4తో సమర్థించారు. కాలిఫోర్నియాకు చెందిన కుపర్టినో అనే టెక్నాలజీ కంపెనీ తన యాప్స్ ను యాప్ స్టోర్ ద్వారా అమ్మాల్సి వచ్చింది. ఈ కొనుగోళ్లలో 30 శాతానికి పైగా మొత్తాన్ని యాపిల్ సంస్థ తన కమిషన్ గా తీసుకుంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నియమించిన కన్జర్వేటివ్ జస్టిస్ బ్రెట్ కవానా యాపిల్ కి వ్యతిరేకంగా కోర్టులోని నలుగురు లిబరల్ జస్టిస్ లకు మద్దతుగా నిలిచారు. కోర్టు ఈ నిర్ణయం తర్వాత యాపిల్ షేర్లలో తగ్గుదల కనిపించింది.