జమ్మూ కాశ్మీర్లో భారీ పెట్టుబడులు..!!

జమ్మూ కాశ్మీర్లో భారీ పెట్టుబడులు..!!

జమ్మూ కాశ్మీర్ కు సంబంధించి స్వయం ప్రతిపత్తిని రద్దు చేసిన తరువాత మోడీ చేస్తున్న విదేశీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.  ముఖ్యంగా మోడీ ఫ్రాన్స్, యూఏఈ, జి 7 దేశాల సదస్సుల్లో పాల్గొంటున్నారు.  ఇటీవలే మోడీ ఫ్రాన్స్ లోని భారతీయులను గురించి ప్రసంగించారు.  ఆర్టికల్ 370 రద్దుకు వారి నుంచి అనూహ్యమైన స్పందన లభించింది.  అలానే, పెట్టుబడులు పెట్టేందుకు ఫ్రాన్స్ కు చెందిన వ్యాపారవేత్తలు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.  

మరోవైపు మోడీ నిన్న యూఏఈ చేరుకున్నారు.  అక్కడ ఆ దేశ అత్యుత్తమ అవార్డును అందుకున్నారు.  ఈ సందర్భంగా ఆ దేశ రాజుతో అయన భేటీ అయ్యారు.  ఇద్దరి మధ్య అనేక విషయాల గురించి చర్చలు జరిగాయి.  ఆర్టికల్ 370 రద్దు తరువాత ఇండియాకు మద్దతు ఇచ్చినందుకు అయన యూఏఈకి ధన్యవాదాలు తెలిపారు.  అంతేకాదు, జమ్మూ కాశ్మీర్లో పెట్టుబడులు పెట్టేందుకు యూఏఈని ఆహ్వానించారు.  యూఏఈ కూడా అందుకు సంసిద్ధతను వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు, మోడీ ఫ్రాన్స్ లో జరుగుతున్న జి7 సదస్సులో మోడీ పాల్గొనబోతున్నారు.  ఫ్రాన్స్ ప్రత్యేక ఆహ్వానం మేరకు మోడీ ఈ సదస్సులో పాల్గొంటున్నారు.