'ఉబర్' హెలికాప్టర్లు.. కారు అద్దె కంటే తక్కువే..!

'ఉబర్' హెలికాప్టర్లు.. కారు అద్దె కంటే తక్కువే..!

ఇప్పుడు అద్దె కార్లను ఆశ్రయించేవారు ఎక్కువైపోయారు.. కొన్ని ప్రాంతాల్లో ఆటోల కంటే కార్లు ఎక్కేవారి సంఖ్యే ఎక్కవగా ఉందట... అయితే, వినియోగదారుల అభిరుచులకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు ఆయా సంస్థలు కూడా ట్రెండ్ మారుస్తూ వస్తున్నాయి.. కార్‌ అగ్రిగేటర్‌గా సంచలనం సృష్టించిన ఉబర్‌ టెక్నాలజీస్‌ ఇపుడు యాప్‌ ద్వారా హెలికాప్టర్‌ సర్వీసులను తీసుకువచ్చింది. మన్‌హాటన్‌లో ఈ సేవలను ప్రారంభించినట్లు సంస్థ పేర్కొంది. ఇక, హెలికాప్టర్ సేవలు.. కారు కంటే తక్కువకే అందుబాటులో ఉండడం మరో విశేషం.. ఉదహరణకు మన్‌హాటన్‌ నుంచి జేకేఎఫ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్టుకు ఊబర్‌ హెలికాప్టర్‌ 108.98 డాలర్లు వసూలు చేస్తుండగా, అదే ప్రయాణానికి కారు సర్వీస్‌  అయితే 163.11 డాలర్లు వసూలు చేస్తున్నారట.. అంటే.. కారు ప్రయాణం కంటే హెలికాప్టర్ ప్రయాణమే చౌక.. ఇక, సాధారణ హెలికాప్టర్‌ 200 నుంచి 225 డాలర్లు చార్జ్‌ చేస్తారు. ఉబర్‌ డిస్కౌంట్‌ కారణంగా వంద డాలర్లకే ఈ సర్వీసు అందిస్తున్నారు. అయితే, హెలికాప్టర్‌ సర్వీసు చార్జి కూడా దూరం, సమయం, రద్దీ, డిమాండ్‌ను బట్టి ఉంటుందని ఉబర్ చెబుతోంది.