మ‌రో ఏడాది వ‌ర్క్‌ఫ్ర‌మ్ హోం.. ఇంకా వాళ్ల‌కు ఊబెర్ స్పెష‌ల్ ప్యాకేజీ..!

మ‌రో ఏడాది వ‌ర్క్‌ఫ్ర‌మ్ హోం.. ఇంకా వాళ్ల‌కు ఊబెర్ స్పెష‌ల్ ప్యాకేజీ..!

క‌రోనా మ‌హ‌మ్మారి రోజురోజుకీ విజృంభిస్తుండ‌డంతో.. ఇప్ప‌టికే త‌మ ఉద్యోగుల‌కు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం ఇచ్చిన చాలా సంస్థ‌లు మ‌ళ్లీ పొడిగిస్తూనే వ‌స్తున్నాయి.. క‌రోనా స‌మ‌యంలో తమ ఉద్యోగుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తోన్న ఊబెర్ సంస్థ‌... వ‌చ్చే ఏడాది జూన్ (జూన్ 2021) వ‌ర‌కూ తమ ఉద్యోగులకు వెసులుబాటు క‌ల్పించింది. వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం వెసులుబాటు క‌ల్పించి చేతులు దులుపుకోవ‌డం కాకుండా.. ఉద్యోగులు ఇంట్లోనే కార్యాల‌యం ఏర్పాటు చేసుకునేందుకు 500 డాలర్లను కేటాయించింది ఊబెర్‌... తమ ఉద్యోగులు దీర్ఘకాలిక ప్రణాళికలు చేసుకోవడానికి అవసరమైన స్పష్టతను, స్వేచ్ఛను కల్పించాలన్న లక్ష్యంతోనే ప్రత్యేక ప్యాకేజీని అందిస్తున్నామని ప్ర‌క‌టించింది ఆ సంస్థ‌.