మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు సర్వం సిద్దం !
మహారాష్ట్రలో నెల రోజులుగా సాగుతున్న రాజకీయ సంక్షోభం కొలిక్కివస్తోంది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాయి. శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ దిశగా జరిగిన చర్చల్లో ఏకాభిప్రాయం కుదిరినట్లు శరద్ పవార్ ప్రకటించారు. ఈ మూడు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు కూడా ఉద్దవే సీఎం అంటు సంతకాలు చేశారు. కాంగ్రెస్, ఎన్సీపీలకు ఉప ముఖ్యమంత్రుల పదవులు దక్కనున్నాయన్నారు. ఈ రోజు ముంబైలోని నెహ్రూ సెంటర్లో శివసేన నేతలు ఉద్ధవ్ థాకరే, అదిత్య థాకరేలతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్, సీనియర్ నేత అజిత్ పవార్, కాంగ్రెస్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, పృథ్వీరాజ్ చౌహాన్, అశోక్ చౌహాన్ లు సమావేశమయ్యారు. ఈ భేటీలో సీఎంగా ఉద్దవ్ థాకరే పేరుపై ఏకాభిప్రాయం కుదిరిందని శరద్ పవార్ ప్రకటించారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)