రేపు టీటీడీ ఆలయాల్లో ఉగాది వేడుకలు

రేపు టీటీడీ ఆలయాల్లో ఉగాది వేడుకలు

టీటీడీ పరిధిలోని తిరుపతి, పరిసర ప్రాంతాల్లోని ఆలయాల్లో శనివారం వికారినామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించనున్నారు. తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయంలో మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 6 నుంచి 7.30గంటల వరకు పుష్పపల్లకీలో అమ్మవారు ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరిస్తారు. రాత్రి 8 నుంచి 8.30 గంటల వరకు పంచాంగ శ్రవణం జరపనున్నారు. తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో ఉదయం సుప్రభాతంతో స్వామిని మేల్కోల్పి తోమాల, కోలువు, పంచాంగ శ్రవణం, అర్చన నిర్వహిస్తారు. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ఉగాది ఆస్థానం జరుపుతారు. కోదండరామాలయంలో సాయంత్రం 4 నుంచి 5గంటల వరకు ఉగాది ఆస్థానం, పంచాంగ శ్రవణం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జీయర్ స్వామి మూలవర్లకు, ఉత్సవర్లకు వస్త్ర సమర్పణ చేస్తారు.