నీర‌వ్ మోడీకి షాక్..

నీర‌వ్ మోడీకి షాక్..

పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ కుంభ‌కోణంలో వ‌జ్రాల వ్యాపారి నీర‌వ్ మోడీకి గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. నీర‌వ్‌ను భార‌త్ కు అప్ప‌గించేందుకు బ్రిట‌న్ హోంమంత్రి ప్రీతి ప‌టేల్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు.. ఈ మేర‌కు ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఇక‌, త‌నను భార‌త్‌కు అప్ప‌గించ‌డాన్ని స‌వాల్ చేస్తూ.. నీర‌వ్ మోడీ చేసిన న్యాయ‌పోరాటంలో ఇప్ప‌టికే ఆయ‌న‌కు షాక్ త‌గిలింది.. భార‌త్‌లో స‌రైన ద‌ర్యాప్తు జ‌ర‌గ‌ద‌న్న‌ నీర‌వ్ వాద‌న‌ను ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 25వ తేదీన తోసిపుచ్చిన బ్రిట‌న్ వెస్ట్ మినిస్ట‌ర్ మేజిస్ట్రేట్స్ కోర్టు..

మ‌రోవైపు, కోవిడ్ ప‌రిస్థితుల దృష్ట్యా.. నీర‌వ్ మోడీ మాన‌సిక ఆరోగ్యం బాగాలేద‌ని, భార‌త్ లో మాన‌వ హ‌క్క‌ల ఉల్లంఘ‌న‌ను సాకుగా చూపిన ఆయ‌న త‌ర‌పు అడ్వ‌కేట్ల వాద‌న‌నూ కోర్టు.. తోసిపుచ్చింది.. అయితే, త‌న‌ను అప్పగించే ఉత్తర్వులకు వ్యతిరేకంగా యూకే హైకోర్టులో అప్పీల్ చేయడానికి నీర‌వ్ మోడీకి ఇప్పుడు 14 రోజులు సమయం కూడా ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇక‌‌. నీరవ్ మోడీని ఆర్థర్ రోడ్ జైలులో బరాక్ నెంబర్ 12లో ఉంచడం గురించి భారత ప్రభుత్వం సమగ్ర హామీ ఇచ్చింద‌ని  జడ్జి గూజీ పేర్కొన్నారు.. ముంబైలోని హై-సెక్యూరిటీ ఆర్థర్ రోడ్ జైలులో ఉన్న బారక్ నంబర్ 12 లోని మూడు సెల్‌లలో ఒక‌టి మోడీకి కేటాయిస్తామ‌ని భార‌త్ తెలిపింద‌న్నారు.