బ్రిటన్ అసాంజెను మరణశిక్ష విధించే దేశాలకు అప్పగించనని మాటిచ్చింది!!!

బ్రిటన్ అసాంజెను మరణశిక్ష విధించే దేశాలకు అప్పగించనని మాటిచ్చింది!!!

వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజెను మరణశిక్ష అమలు చేసే దేశాలకు అప్పగించబోనని బ్రిటన్ తమకు హామీ ఇచ్చినట్టు ఈక్వెడార్ తెలిపింది. గురువారం లండన్ లో అసాంజెను అరెస్ట్ చేసిన తర్వాత ఈక్వెడార్ అధ్యక్షుడు లెనిన్ మోరెనో ఈ విషయం ప్రకటించారు. 'మానవ హక్కులు, అంతర్జాతీయ న్యాయానికి బలంగా నిబద్ధులమైన మేము, అసాంజెను చిత్రహింసలు పాల్జేసే లేదా మరణశిక్ష విధించే ఏ దేశానికీ అప్పగించరాదని గ్రేట్ బ్రిటన్ నుంచి హామీ కోరాను. మా చట్టాలకు అనుగుణంగా బ్రిటిష్ ప్రభుత్వం లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చిందని' మోరెనో ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఒక వీడియోలో చెప్పారు.