తెరుచుకున్న బద్రీనాథ్ ఆలయం

తెరుచుకున్న బద్రీనాథ్ ఆలయం

ప్రముఖ పవిత్ర పుణ్యక్షేత్రమైన బద్రీనాథ్ ఆలయాన్ని తెరిచారు. ఏటా ప్రతికూల పరిస్థితుల మధ్య శీతాకాలంలో బద్రీనాథ్ ఆలయాన్ని ఆరునెలల పాటు మూసివేస్తారు. తిరిగి వేదపండితులు ఆలయాన్ని తెరిచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. భక్తులు ఆ మహా విష్టువును దర్శించుకోవడానికి తండోపతండాలుగా ఆలయానికి చేరుకున్నారు. చార్‌ధామ్‌ యాత్రలో భాగంగా ఉత్తరాఖండ్‌లోని నాల్గో పుణ్యక్షేత్రమైన బద్రీనాథ్‌ ఆలయాన్ని హిందూవులు దర్శించుకుంటారు. కేదర్‌నాథ్ జ్యోతిర్లింగ ఆలయ క్షేత్రంలో నిన్న పూజలు ప్రారంభమైన సంగతి తెలిసిందే.