నిప్పుకిప్పుడు తుప్పు పట్టిందా ?

నిప్పుకిప్పుడు తుప్పు పట్టిందా ?

చంద్రబాబు పీఎస్ ఇంట్లో జరిగిన ఐటీ సోదాలతో తమకు ఎటువంటి సంబంధం లేదంటూ యనమల స్పందించడంపై ఏపీ మండలి చీఫ్‌ విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబు, లోకేష్‌ల ఆర్ధిక లావాదేవీలకు సంబంధించి యనమవ వకాల్తా పుచ్చుకున్నారా అని ఆయన ప్రశ్నించారు. ఐటీ సోదాలపై చంద్రబాబు, లోకేష్ ఎందుకు మౌనం వహిస్తున్నారో చెప్పాలని అన్నారు. 2 వేల కోట్లు అక్రమంగా చేతులు మారాయని ఐటీ శాఖ వెల్లడించిందని తాను నిప్పుని అనిచెప్పుకునే చంద్రబాబు ఇప్పుడెందుకు మాట్లాడటం లేదని ఉమ్మారెడ్డి ప్రశ్నించారు. నిప్పుకిప్పుడు తుప్పు పట్టిందా అని ఎద్దేవా చేశారు. ఓటుకు నోటు కేసులో దొరికినప్పుడు సైతం అది తన వాయిస్ కాదని బహిరంగంగా చెప్పిన చంద్రబాబు ఇప్పుడెందుకు సైలెంటయ్యారని ఉమ్మారెడ్డి ప్రశ్నించారు. తండ్రీ కొడుకుల మౌనం వస్తున్న విమర్శలకు బలం చేకూర్చేలా ఉందని, రూ. 2 వేల కోట్లు అక్రమంగా చేతులు మారాయని ఐటీ శాఖ వెల్లడించిందని అన్నారు. పీఎస్ శ్రీనివాసుకు షెల్ కంపెనీల ద్వారా అక్రమ లావాదేవీలు చేసేంతటి స్థాయి కలిగిన వ్యక్తా..? అని ఆయన ప్రశ్నించారు. బాబు అక్రమాలు ఎల్లకాలం దాగవన్న ఆయన వాస్తవాలు బయట పెట్టాలని అన్నారు. ఈ మొత్తం వ్యవహరంలో తనకు సంబంధం లేకుంటే అదే విషయాన్ని వెల్లడించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఐటీకి దొరికిపోతామనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏపీలో ఐటీ రాకుండా అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు.