బాబుకు ఎందుకు భయం?: ఉమ్మారెడ్డి

బాబుకు ఎందుకు భయం?: ఉమ్మారెడ్డి

'మా పరిపాలన ప్రారంభం కంటే ప్రతిపక్ష టీడీపీ ఆరోపణలు ముందున్నాయి. చంద్రబాబు ఆరోపణలు చేయడంలో అభ్యంతరం లేదు. కానీ.. ఎలాంటి విమర్శలు చేస్తున్నారో ఆత్మ విమర్శ చేసుకోవాలి' అని అన్నారు వైసీపీ సీనియర్‌ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు. ప్రభుత్వానికి హెచ్చరిక చేయడం, అభివృద్ధి ఆపారని వ్యాఖ్యానించడం బాబు వంటి సీనియర్‌ నేతకు తగదన్నారు. ఇవాళ ఉమ్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై సమీక్షిస్తే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. నూతన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర ప్రజల కోసమేన్న ఆయన.. గత ప్రభుత్వ హయాంలోని బిల్లుల చెలింపుల్లో అవకతవకలు, అక్రమాలు జరిగాయన్నారు. టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నామని ఆరోపించడం సరికాదన్నా ఉమ్మారెడ్డి.. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే దాడులు జరిగాయన్నారు.