'తెలుగు టైటాన్స్‌'కు ఎదురుదెబ్బ

'తెలుగు టైటాన్స్‌'కు ఎదురుదెబ్బ

ప్రో కబడ్డీ సీజన్‌-7లో తెలుగు టైటాన్స్‌ తొలి మ్యాచ్‌లోనే ఓడిపోయింది. యు ముంబా చేతిలో 6 పాయింట్ల తేడాతో పరాజయం పాలయ్యింది. గేమ్‌ ప్రారంభం నుంచే తడబడిన తెలుగు టైటాన్స్‌.. యు ముంబాకు అనవసర పాయింట్లు సమర్పించుకున్నారు. యు ముంబాకు 31 పాయింట్లు రాగా.. టైటాన్స్‌కు 25 పాయింట్లు వచ్చాయి. 

హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరిగింది.  ఈసారి 'ఇస్‌ సే టఫ్‌ కుచ్‌ నహీ-ఇంతకంటే కష్టం మరోటి లేదు' నినాదంతో టైటాన్స్‌ బరిలోకి దిగారు. ఇక.. టోర్నీ రెండో మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ బెంగళూరు బుల్స్‌‌తో మూడు సార్లు ఛాంపియన్ పట్నా పైరెట్స్ తలపడనుంది.