ఆర్‌ఆర్‌ఆర్‌ : ఎన్టీఆర్‌ టీజర్‌ ఖాతాలో మరో రికార్డు

ఆర్‌ఆర్‌ఆర్‌ : ఎన్టీఆర్‌ టీజర్‌ ఖాతాలో మరో రికార్డు

ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది. ఇప్పటికే 80 శాతం పైగా షూటింగ్ జరుపుకున్నది. ఇప్పటికే సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీంగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు గా నటిస్తున్నారు. వీరిద్దరి వేర్వేరు ప్రాంతాలు.. వేరు వేరు కాలాలు. అయితే, ఈ సినిమాలో ఈ రెండు పాత్రలను ఎలా కలిపారు. ఎలా సినిమాను రన్ చేస్తున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాకు సంబంధించి "రామరాజు ఫర్‌ భీమ్‌" టీజర్‌ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. అక్టోబర్‌ 22న కొమురం భీం జయంతి సందర్భంగా విడుదలైంది ఈ టీజర్‌.  ఈ టీజర్‌లో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌.. కొమురం భీంగా అదరగొట్టాడు. అయితే.. తాజాగా ఈ టీజర్‌ మరో రికార్డును క్రియేట్‌ చేసింది. గడిచిన 24 గంటల్లో 941k లైక్స్‌, 14.2M వ్యూస్‌తో ఆల్‌ టైం రికార్డును సృష్టించింది ఎన్టీఆర్‌ టీజర్‌. ఈ రికార్డును టాలీవుడ్‌ ఏ సినిమా కూడా ఇప్పటి వరకు నమోదు చేయలేదు. మొదటి సారిగా ఎన్టీఆర్‌ టీజర్‌ మాత్రమే ఈ రికార్డును క్రియేట్‌ చేసింది.   కాగా.. ఈ టీజర్‌ పై వివాదం కూడా రాజుకున్న విషయం తెలిసిందే.. ఆదివాసులను కించ పరిచేలా ఉందని బీజేపీ ఈ టీజర్‌పై సంచలన ఆరోపణలు చేసింది.