కోడలితో మామ ఎఫైర్.. కొడుక్కి తెలిసిపోయింది.. చివరకు..!
అక్రమసంబంధాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది.. ఓవైపు అత్యాచారాలు ఆందోళన కలిగిస్తుంటే.. మరోవైపు.. ఎఫైర్స్ ప్రాణాలమీదకు తెస్తున్నాయి. పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయి... గుట్టుగా వ్యవహారం నడిపిద్దాం అనుకున్నా.. దొంగతనం, అక్రమసంబంధాలు ఎక్కువకాలం సాగవుఅని చెబుతుంటారు కదా.. అలాంటి పరిస్థితులే వచ్చి.. ప్రాణాలు పోయేలా చేస్తోంది. కోడలు అంటే కూతురులాంటింది.. కానీ, ఆ మాటేమర్చిన ఓ మామ.. ఆమెపైనే కన్నేశాడు.. కొడుకులేని సమయం చూసి ఆమెను లోబర్చుకున్నారు.. అలా కోడలితో రాసలీలలు సాగించాడు.. విషయం తెలిసిన కొడుకు కోపంతో ఊగిపోయాడు.. తండ్రిని అత్యంత దారుణంగా హత్య చేశారు.. ఇక, తన తండ్రితోనే బరితెగించిన భార్యపై కూడా పగబట్టాడు.. తండ్రి హత్య కేసులో జైలు జీవితం గడిపిన అతడు.. బయటకురాగానే.. భార్యని కూడా కిరాతకంగా నరికి చంపాడు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఈ దారుణ ఘటన సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం జల్మలకుంట తండాలో జరిగింది.. సరోజ అనే వివాహిత.. సొంతమామతోనే అక్రమసంబంధం పెట్టుకుంది.. భర్త ఇంట్లో లేని సమయంలో మామతో రాసలీలలు సాగించింది. ఈ వ్యవహారం గుట్టుగా కొంతకాలం సాగినా.. చివరకు ఆ విషయం కొడుక్కి తెలిసిపోయింది.. దీంతో.. కన్నతండ్రిని దారుణంగా హత్య చేశాడు... జైలు జీవితం కూడా గడిపాడు.. ఇదే సమయంలో భార్యపై కూడా కోపంతో రగిలిపోతూ... పగపెంచుకున్నాడు.. జైలు నుంచి బెయిల్పై బయటికొచ్చి భార్యపై గొడ్డలితో విచక్షణారహితంగా దాడి చేశాడు.. దీంతో.. ఆమె ఘటనా స్థలంలోనే మృతిచెందింది.. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.. కొన్ని క్షణాల సుఖం కోసం తొందరపాటులో చేసిన ఓ తప్పు.. రెండు నిండు ప్రాణాలు మింగేసింది.. మరో వ్యక్తి జైలుకే పరిమితం అయ్యేలా చేసింది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)