ఉండవల్లి తాజా సర్వే...

ఉండవల్లి తాజా సర్వే...

ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి... ఓవైపు టీడీపీ, ఎన్డీఏకు గుడ్‌బై చెబితే... మరోవైపు వైసీపీ ఎంపీలు రాజీనామాలు సమర్పించడం... ఇలా రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు పాలక, ప్రతిపక్షం పూనుకుంది. అయితే ఏపీలో తాజా రాజకీయ బలాబలాపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఉన్నట్టుండి ఇప్పుడే ఎన్నికలు జరిగితే ఏపీలో వైసీపీకే ఎక్కువల సీట్లు వస్తాయని వెల్లడించారు ఉండవల్లి... రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన... ఇప్పుడు ప్రజల్లో వేవ్ వైఎస్ జగన్‌కు అనుకూలంగా ఉందన్నారు. అయితే ప్రజల్లో ఉన్న వేవ్‌ను మార్చగలిగే సామర్థ్యం సీఎం చంద్రబాబుకు ఉందన్నారు ఉండవల్లి. వైఎస్ జగన్ కు సరైన ఎన్నికల టీమ్ లేదని వెల్లడించిన ఉండవల్లి... పవన్ కళ్యాణ్ బలంపై ఇప్పుడే ఓ అంచనా వేయలేం అన్నారు.