వెయ్యికి పైగా ఉత్పత్తుల ధర రూ.200 కంటే తక్కువ

వెయ్యికి పైగా ఉత్పత్తుల ధర రూ.200 కంటే తక్కువ

ఫర్నీచర్‌ దిగ్గజ స్టోర్ ఐకియా రేపే హైదరాబాద్ లో లాంచ్‌ కాబోతుంది. భారత్ లో ప్రారంభం కానున్న మొట్ట మొదటి స్టోర్ కూడా ఇదే. ఈ స్వీడిష్‌ ఫర్నిచర్ స్టోర్ ప్రారంభం గత కొన్నాళ్లుగా వాయిదా పడుతూ వచ్చింది. వినియోగదారుల అన్ని అవసరాలను అందిపుచ్చుకోవడం, అతి ధరల్లో ఫర్నీచర్ ఇవ్వటం, వంటివి చేపట్టనున్నట్టు ఐకియా పేర్కొంది. 
ఐకియా తొలి స్టోర్‌ హైటెక్‌ సిటీ, రాయదుర్గం‌, శేరిలింగంపల్లి మండలం‌, ప్రారంభించనున్నారు. రోజూ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల స్టోర్‌ తెరిచి ఉంచనునన్నారు. 13 ఎకరాల కాంప్లెక్స్‌లో ఏర్పాటైన ఈ స్టోర్‌కు ఏడాదికి 60 లక్షల మంది విచ్చేసే అవకాశముంది. 4 లక్షల చదరపు అడుగుల ఈ షోరూంలో 7500 ఉత్పత్తులను ఆఫర్‌ చేయబోతుంది. వీటిలో వెయ్యికి పైగా ఉత్పత్తుల ధర రూ.200 కంటే తక్కువే.
ఐదేళ్ల పాటు తమ కార్యకలాపాల్లో సుమారు 30 శాతం, స్థానిక ముడి సరుకులనే వాడనున్నారు.
2025 నాటికి భారత్ లో 25 స్టోర్లను ఏర్పాటు చేయాలని కంపెనీ ప్లాన్‌ చేస్తోంది. అర్బన్‌క్లాస్‌ అనే యాప్‌తో కూడా ఐకియా భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీనిలో భాగంగా కార్పెంటర్స్‌ వంటి పలువురు సర్వీసు ప్రొవైడర్లకు వినియోగదారులను కనెక్ట్‌ చేయనుంది. ఈ స్టోర్‌లో వెయ్యి సీట్ల రెస్టారెంట్ కూడా ఉంది. ఇందులో సగం వెజిటేరియన్‌కు సంబంధించినవే. ఐకియా ఇండియా స్టోర్‌ వచ్చే ఏడాది ఈ-కామర్స్‌ కార్యకలాపాలను ప్రారంభించనుంది. నగరాల్లో ఆన్‌లైన్‌ సేల్స్‌ను ఇది ఆఫర్‌ చేస్తుంది. ముంబైలో ఈ-కామర్స్‌ కార్యకలాపాలను ప్రారంభించాలని ప్లాన్‌ చేస్తుంది.