నేలపాలైన 50వేల లీటర్ల రెడ్ వైన్... ఇదే కారణం... 

నేలపాలైన 50వేల లీటర్ల రెడ్ వైన్... ఇదే కారణం... 

ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయే వాటిల్లో మద్యం కూడా ఒకటి.  ప్రతి దేశంలో మద్యం భారీ స్థాయిలో అమ్ముడవుతుంటుంది.  దీని నుంచే అత్యధిక ఆదాయం వస్తుంది. కొన్ని దేశాల్లో మాములు మద్యం కంటే రెడ్ వైన్ ను ఎక్కువగా సేవిస్తుంటారు. ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ వంటి దేశాల్లో వైన్ ను ఎక్కువగా తీసుకుంటుంటారు.  ఆయా దేశాల్లో ఉత్పత్తి ఎక్కువగా జరుగుతుంది.  ఇదిలా ఉంటె స్పెయిన్ లోని రెడ్ వైన్ ను తయారు చేసే కంపెనీలో ఓ చిన్న ప్రమాదం జరిగింది.  వైన్ ను స్టోర్ చేసే కంటైనర్ లీక్ కావడంతో ఏకంగా 50 వేల లీటర్ల రెడ్ వైన్ నేలపాలైంది.  నేలపాలైన రెడ్ వైన్ ను చూసి మందుబాబులు భోరున విలపించారు.  వేల లీటర్ల మద్యం నేలపాలు కావడంతో ఆ ప్రాంతం మొత్తం ఎర్రని నదిలా మారిపోయింది.  నేలపాలైన రెడ్ వైన్ ఖరీదు కోట్ల రూపాయల్లో ఉంటుందని కంపెనీ అధికారులు చెప్తున్నారు.