నమూనా గణనకు నోటిఫికేషన్ జారీ

నమూనా గణనకు నోటిఫికేషన్ జారీ

2021లో చేపట్టనున్న జనగణనకు సిద్ధమవుతోంది కేంద్రం.. దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలను కూడా సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా 2021లో చేపట్టనున్న జనగణనకు ముందుగా నమూనా గణన కోసం నోటిఫికేషన్ జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం... దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఆగస్టు 12వ తేదీ నుంచి సెప్టెంబరు 30 తేదీ వరకూ నమూనా గణన నిర్వహించాలని రాష్ట్రాలకు సూచించింది కేంద్ర హోంశాఖ. ఇక, కేంద్ర హోంశాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌ను ఉత్తర్వులుగా జారీ చేసింది సాధారణ పరిపాలన శాఖ.