ఫలించిన జగన్ ప్రయత్నం..! గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం...?

ఫలించిన జగన్ ప్రయత్నం..! గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం...?

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నానికి మొత్తానికి కేంద్ర సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది... తెలంగాణ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్రను ఏపీకి రప్పించుకోవడానికి సీఎం జగన్ ప్రయత్నిస్తుండగా.. తాజాగా కేంద్ర దానికి ఆమోద ముద్ర వేసినట్టు సమాచారం.. స్టీఫెన్ రవీంద్రను ఆంధ్రప్రదేశ్‌ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియమించాలని సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారు.. ఇప్పుడు కేంద్రం ఆమోదం తెలపడంతో.. త్వరలోనే స్టీఫెన్ రవీంద్ర.. ఏపీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా బాధ్యతలు చేపడతారనే ప్రచారం సాగుతోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఛీప్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేసిన స్టీఫెన్ రవీంద్ర.. రాయలసీమలోనూ బాధ్యతలు నిర్వర్తించారు. ఇక, జగన్ సీఎం అయినప్పటి నుంచి స్టీఫెన్ రవీంద్ర కోసం పట్టుబడుతున్నారు... ఈ విషయాన్ని కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షాతో కూడా చర్చించారనే ప్రచారం సాగింది. మొత్తానికి జగన్ కోరిక నెరవేరిందని చెబుతున్నారు.