ఏపీ గవర్నర్‌గా సుష్మ.. కేంద్ర మంత్రి ట్వీట్‌..!

ఏపీ గవర్నర్‌గా సుష్మ.. కేంద్ర మంత్రి ట్వీట్‌..!

ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్‌ను నియమించబోతున్నట్టు ఇవాళ ఉదయం జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో కొత్త గవర్నర్‌ను నియమించే అంశాన్ని పరిశీలిస్తున్న కేంద్రం.. ఆ పదవికి సుష్మాస్వరాజ్‌ను ఎంపిక చేయబోతున్నట్టు బీజేపీ వర్గాల ద్వారా సమాచారం అందిందని కథనాలు కనిపించాయి. ఇవన్నీ ఊహాగానాలే అనుకుంటున్న సమయంలో.. 'ఏపీ గవర్నర్‌గా నియమితులైన సుష్మాస్వరాజ్‌కు శుభాకాంక్షలు' అంటూ కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ ట్వీట్‌ చేశారు. ఐతే.. కొద్దిసేపటికే ఆయన ఆ ట్వీట్‌ను డిలీట్‌ చేశారు. ఈ నేపథ్యంలో.. ఏపీ గవర్నర్‌గా సుష్మ నియమితులయ్యారా లేదా అనే విషయమై ఉత్కంఠ నెలకొంది. 

ఈ ఎన్నికల్లో సుష్మాస్వరాజ్ పోటీ చేయాలేదు. ఆమెతోపాటు మాజీ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ కూడా బరిలోకి దిగలేదు. వీరిద్దరినీ గవర్నర్లుగా పంపిస్తారని జాతీయ మీడియాలో వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి.