వారి జీవితాల్లో ఈ సంక్రాంతి నుండే మార్పు వస్తుంది : కిషన్ రెడ్డి

వారి జీవితాల్లో ఈ సంక్రాంతి నుండే మార్పు వస్తుంది : కిషన్ రెడ్డి

తెలుగు ప్రజలందరికీ బీజేపీ ,కేంద్ర ప్రభుత్వం తరుపున సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ...  రానున్న రోజుల్లో దేశం అన్ని రంగాల్లో మార్పులు తీసుకురావాలని ఈ పండగ సందర్భంగా కోరుకుంటున్న అన్నారు. కరోనా మహమ్మారి నుండి ఎదుర్కోవడానికి వ్యాక్సిన్ వచ్చింది. దేశంలో అన్ని రంగాల్లో ప్రభుత్వ  ప్రయివేటు పని చేస్తున్నవారు లో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. వారి జీవితాల్లో ఈ సంక్రాంతి నుండే మార్పు వస్తుంది. ప్రపంచంలో 4 కంపనిలు వ్యాక్సిన్ కనుక్కుంటే అందులో 2 మన దేశానికి చెందినవే ఒకటి మన తెలంగాణ కి చెందినది. కొత్త వ్యవసాయ చట్టాల వల్ల రైతుల జీవితాల్లో వెలుగులు నింపాలి. అన్ని రకాల సమస్యల నుండి తెరుకోవలని కోరుకుంటున్న. తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా పాలించే నిజమైన రోజులు రావాలని కోరుకుంటున్న అని పేర్కొన్నారు.

ఇక బీజేపీ జాతీయ ఓబీసీ అధ్యక్షులు లక్ష్మణ్ మాట్లాడుతూ...  సంక్రాంతి పండుగ పురస్కరించుకుని ఇక్కడ కైట్ ఫెస్టివల్ నిర్వహణ జరుగుతుంది. కరోన మహమ్మారి తరలి పోవాలి. సంక్రాంతి ప్రకృతి తో ముడిపడి ఉన్న పండగ. గొబ్బెమ్మలు ,పూలు ,ముగ్గులు పెట్టడం వల్ల క్రిమికిటకలు రాకుండా ఉండేవి.. సంక్రాంతి కి పిండి వంటలు ఆహారపు అలవాట్లు మళ్ళీ గుర్తు చేస్తుంది. పట్టణాల్లో ఫాస్ట్ ఫుడ్ లు ,పిజా ,బర్గర్లు తినడం వల్ల రోగ నిరోధక శక్తి తగ్గి కోవిడ్ కేసులు ఇక్కడే వస్తున్నాయి... ఆహారపు అలవాట్లు మారడం వల్లే వ్యాధులు వస్తున్నాయి.. ప్రధాని నరేంద్రమోడీ ,శాస్త్రవేత్తల కృషి వల్లే రేపటి నుండి వ్యాక్సిన్ పంపిణీ జరుగుతుంది అని అన్నారు.