కోడెల మృతిపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..

కోడెల మృతిపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..

ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య వ్యవహారంలో కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్రహోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్‌రెడ్డి.. ఈ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వంపై తమకు కొన్ని ఫిర్యాదులు అందాయన్న ఆయన.. పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయని.. కేంద్రంతో దర్యాప్తు చేయిస్తామని తెలిపారు. ఇక, కోడెల మృతిచెందడం చాలా బాధగా ఉందన్నారు కిషన్ రెడ్డి... కోడెలతో తనకు వ్యక్తిగత సంబధాలున్నాయని గుర్తుచేసుకున్న ఆయన.. ఏ ప్రభుత్వమైనా చట్టాలను చేతిలోకి తీసుకోకూడదని హితవుపలికారు. రెండు రాష్ట్రాల డీజీపీల నుంచి నివేదికలు తెప్పించుకుంటానని.. కోడెల మృతిపై రెండు రాష్ట్రాలు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని సూచించారు. కోడెల మృతి విచారణ అంశాన్ని కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకెళ్తానని.. కోడెల మృతిపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతామని వెల్లడించారు కిషన్ రెడ్డి.