పాక్‌లో 23 శాతం తగ్గిన ముస్లింల సంఖ్య..! భారత్‌లో చొరబడి స్థిరపడ్డారా..?

పాక్‌లో 23 శాతం తగ్గిన ముస్లింల సంఖ్య..! భారత్‌లో చొరబడి స్థిరపడ్డారా..?

సీఏఏ, ఎన్‌ఆర్సీ, ఎన్‌పీఆర్‌కి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.. కులం, మతం, వర్గం అనే తేడా లేకుండా రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నారు... ముఖ్యంగా ఓ వర్గాన్ని టార్గెట్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే, క్యాబ్ బిల్లుతో ఎవరికీ వచ్చిన నష్టం లేదని స్పష్టం చేశారు కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్.. రాజకీయ కుట్రతోనే అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించిన ఆయన.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... ఎంఐఎం పార్టీకి తొత్తుగా మారారు.. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ చెప్పినట్టుగా కేసీఆర్ వింటున్నారు... అందుకే సీఏఏను వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. సీఏఏపై తెలంగాణ ప్రజల్లో కేసీఆర్ భయాందోళనలు రేకెత్తిస్తున్నారన్న మండిపడ్డ గోయల్... అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇదే సమయంలో... కేంద్రమంత్రి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.. పాకిస్థాన్‌లో 23 శాతం ముస్లింసల సంఖ్య తగ్గిందట అని తెలిపిన ఆయన.. మరి వాళ్లంతా ఏమయ్యారు? అని ప్రశ్నించారు... వాల్లు చనిపోయి ఉండాలి..! ఇస్లామిక్‌లోనైనా కలిసి ఉండాలి...! లేదా భారత్‌లోకి చొరబడి స్థిరపడి ఉండాలి అంటూ అనుమానాలను వ్యక్తం చేశారు.