కేంద్ర క్రీడామంత్రి ఫిట్‌నెస్ సీక్రెట్స్ 

కేంద్ర క్రీడామంత్రి ఫిట్‌నెస్ సీక్రెట్స్ 

కేంద్ర క్రీడాశాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ మాజీ సైనికాధికారి అనే విషయం తెలిసిందే. ఎయిర్ రైఫిల్ షూటింగ్ లో దేశానికి ఒలింపిక్ పతకం కూడా సాధించిన రాజ్యవర్ధన్ సింగ్ ఇప్పటికీ తన ఫిట్ నెస్ మీద ఎంతో శ్రద్ధ చూపిస్తారు. ఇటీవలే రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ మొదలుపెట్టిన 'ఫిట్‌నెస్ ఛాలెంజ్' తో సోషల్ మీడియా మోర్మ్రోగిపోయింది. వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు తమ ఫిట్ నెస్ వీడియోలను పెట్టి దేశవ్యాప్తంగా ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సిన ఆవశ్యకతను గుర్తు చేశారు. అలాంటి కేంద్ర క్రీడా మంత్రి తన బిజీ షెడ్యూల్ లో కాసేపైనా వర్కౌట్ చేస్తానని చెబుతూ తన ట్విట్టర్ లో ఓ వీడియో పెట్టారు. ఇందులో దాదాపు రాత్రి 10 గంటల సమయంలో ఇంటికి వచ్చిన రాజ్యవర్ధన్ సింగ్ వివిధ వ్యాయామాలు చేస్తూ కనిపించారు.