ఎంపీ కవితకు మరో అరుదైన గౌరవం

ఎంపీ కవితకు మరో అరుదైన గౌరవం

నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవితకు మరో అరుదైన గౌరవం దక్కింది. యునైటెడ్‌ నేషన్స్‌ గ్లోబల్‌ కాంపాక్ట్‌ స్థానిక సంస్థ, గ్లోబల్‌ నెట్‌వర్క్‌ ఇండియా మార్చి 1వ తేదీన న్యూఢిల్లీలో లింగ సమానత్వ సమావేశం నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించాల్సిందిగా ఎంపీకి ఆహ్వానం అందింది. లింగ సమానత్వం కోసం చేస్తున్న ప్రయత్నాలు, ఎస్‌డీజీ లక్ష్యాల సాధన కోసం చేస్తున్న కృషి గుర్తించి ఆమెను ఎంపిక చేసినట్లుగా సమాచారం.