గొంతు కోసుకున్న ఇంటర్‌ విద్యార్థి

గొంతు కోసుకున్న ఇంటర్‌ విద్యార్థి

ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్ధి బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ దారుణ ఘటన నల్లగొండలోని పాలిటెక్నిక్ కలశాల వద్ద జరిగింది. సూర్యాపేట జిల్లా కసారాబాద్‌కు చెందిన మాచర్ల తరుణ్ కుమార్ అనే విద్యార్ధి సూర్యాపేటలోని ప్రగతి కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. సోమవారం పరీక్ష రాసిన అనంతరం ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తానని చెప్పి హాస్టల్ నుండి బయటికి వెళ్ళాడు.

ఇంటర్ పరీక్షల్లో తప్పుతానేమోననే భయంతో తరుణ్ ఆత్మహత్యాయత్నం చేసుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలో బ్లేడుతో గొంతు, మణి కట్టు, మర్మాంగం కోసుకున్నాడు. రక్తం కారుతున్నా కూడా తరుణ్ రాత్రంతా అక్కడే పడి ఉన్నాడు. ఉదయం వాకింగ్ కి వెళ్లిన వ్యక్తులు చూసి పోలీసులకు, అతని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు తరుణ్ పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరుకున్న తరుణ్ తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.