పెళ్లికి ముందు సెక్స్..! ఇక జైలుకే..!?

పెళ్లికి ముందు సెక్స్..! ఇక జైలుకే..!?

పెళ్లికి ముందే ఆ అనుభవాన్ని చూస్తున్నారా? పెళ్లి చేసుకోకుండానే అన్నీ ఆస్వాధిస్తున్నారా? గర్ల్ ఫ్రెండ్స్, లవర్స్‌తో సెక్స్ ఎంజాయ్ చేస్తున్నారా? అయితే మీకు షాక్ తప్పదు..! ఊచలు లెక్కపెట్టాల్సిందే..! చిప్పకూడు రుచి చూడాల్సిన పరిస్థితి వస్తుంది. పెళ్లికాని జంటలు లైంగిక సంబంధం కలిగి ఉండడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ కొత్త చట్టాలను తయారు చేస్తోంది.. ఇండోనేషియా ప్రభుత్వం. కొత్త చట్టాల ప్రకారం పెళ్లికి ముందు సెక్స్ సంబంధాలున్న వారికి జైలు శిక్ష తప్పదు. అయితే, ఈ చట్టంలో కొన్ని మార్పులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పెళ్లికానివారు దేశంలో లైంగిక సంబంధం పెట్టుకోవడం నేరంగా బిల్లు రూపొందిస్తున్నారు.. వీటిలో కొన్ని మార్పులు చేస్తున్నారు.. ఏజ్ లిమిట్‌ను పొందుపర్చే అవకాశాలను పరిశీలిస్తున్నారు. బిల్లు పూర్తిస్థాయిలో సిద్ధమైన తర్వాత పార్లమెంట్‌ ముందుకు తీసుకెళ్లనున్నారు.