తెలుగులో పోయినా హిందీలో రికార్డ్ కొట్టింది !

తెలుగులో పోయినా హిందీలో రికార్డ్ కొట్టింది !

 

కిశోర్ తిరుమల దర్శకత్వంలో హీరో రామ్ చేసిన సినిమా 'ఉన్నది ఒకటే జిందగీ'.  ఈ సినిమా తెలుగులో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.  విజయంపై ఆశలు పెట్టుకున్న రామ్ కు నిరాశను మిగిల్చింది.  కానీ హిందీలో మాత్రం రికార్డ్ క్రియేట్ చేసింది.  ఈ సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్ ను గోల్డ్ మైన్స్ టెలీ ఫిలిమ్స్ అనే యూట్యూబ్ ఛానెల్ దక్కించుకుంది.  'నెం 1 దిల్వాల' పేరుతో  విడుదలైన ఈ సినిమా ఇప్పటి వరకు 30 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది.  ఇంత త్వరగా 30 మిలియన్ల వ్యూస్ అందుకున్న డబ్బింగ్ సినిమా ఇదేనని ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది.